Robovac X8 Hybrid: ఇది వాక్యూమ్‌ క్లీనరా.. మనిషి చేసే పనులన్నీ ఇదే చేస్తుందే..!

16 Nov, 2021 21:34 IST|Sakshi

అమెరికన్ కంపెనీ అంకర్ అదిరిపోయే  రోబోట్ వాక్యూమ్ 'రోబోవాక్ జి ఎక్స్‌ 8' హైబ్రిడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఏఐ మ్యాప్ 2.0 టెక్నాలజీతో మనిషి చేసే పనులన్నింటిని ఇదే చేస్తుంది. 

రోబోవాక్ జి ఎక్స్‌ 8 ఫీచర్లు 
ఇళ్లలోని జంతు ప్రేమికులకు మరింత సౌకర్యంగా రోబోవాక్ జి ఎక్స్‌ 8 గా ఉండనుంది. ఇందులో ఉండే ఐపాత్‌ లేజర్‌ నావిగేషన్‌, ట్విన్‌ టర్బైన్‌ టెక్నాలజీ అండ్‌ వైఫై ఫీచర్లు ఇంటిని క్లీన్‌ చేసే సమయంలో అడ్డంగా ఉన్న మూగజీవాల్ని తప్పుకొని వెళ్లిపోతుందని అంకర్‌ ప్రతినిధులు తెలిపారు.  గుండ్రంగా ఉండే రోబోవాక్ జి ఎక్స్‌ 8 ఇంట్లో మనుషులు శుభ్రం చేయలేని ప్రాంతాల్ని సులభంగా చేరుకుంటుంది. ఆ ప్రాంతాన్ని క్లీన్‌ చేస్తుంది.  

ధర ఎంతంటే..? 
అల్ట్రా-ప్యాక్ డస్ట్-కంప్రెషన్ టెక్నాలజీ డస్ట్ బాక్స్ వాల్యూమ్ వినియోగాన్ని పెంచుతుంది. తద్వారా మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ డస్ట్‌ను సేకరిస్తుంది. డస్ట్‌ తక్కువగా ఉన్నప్పుడు దాని వేగాన్ని తగ్గిస్తుంది. ఈ రోబోట్‌ వాక్యూమ్ క్లీనర్ ను మాన్యువల్‌గా ఆపరేట్‌ చేయాల్సిన పనిలేకుండా  నో గో జోన్‌ , మల్టీ ఫ్లోర్ మ్యాపింగ్ తో పనిచేస్తుంది. పెట్ హెయిర్ క్లీనింగ్, టూ-ఇన్-వన్‌ వాక్యూమ్, మ్యాపింగ్‌ 2000పీఏ ఎక్స్‌2 సెక్షన్ పవర్‌తో  లేజర్ నావిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్. ధర రూ. 34,999/- 12 నెలల వారంటీతో ఫ్లిప్‌ కార్ట్‌ లో అందుబాటులో ఉంది.  
 

మరిన్ని వార్తలు