లాంచ్‌కు సిద్దమవుతున్న సరికొత్త హెలికాఫ్టర్ - ఇది చాలా స్పెషల్..

9 Dec, 2023 19:10 IST|Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG కార్లతో పరుగులు పెడుతున్న ఆటోమొబైల్ మార్కెట్లో మరో అడుగు ముందుకు వేసి మానవరహిత హెలికాప్టర్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రోటర్ టెక్నాలజీస్ ఇప్పుడు ఓ మానవ రహిత హెలికాప్టర్‌ తయారు చేయడంలో నిమగ్నమైంది. రాబిన్సన్ ఆర్44 రావెన్ II ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ మూడు గంటల కంటే ఎక్కువ సమయం, గంటకు 241 కిమీ/గం వేగంతో ప్రయాణించనుంది. ఇది సుమారు 550 కేజీల బరువును తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ టెస్టింగ్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చాలా సింపుల్‌గా కనిపించే ఈ హెలికాప్టర్‌ను రిమోట్స్ వంటి పరికరాల ద్వారా ఆపరేట్ చేయడం చూడవచ్చు. ఇది చూడటానికి ఓ డ్రోన్ తరహాలో ఉంది. ఇందులో సెన్సార్లు, ఇతర ఆధునిక పరికరాలు ఉండటం వల్ల రాత్రి పూట కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు.

ఇది సాధారణ నాలుగు సీట్లు కలిగిన హెలికాఫ్టర్ మాదిరిగానే కనిపించినప్పటికీ.. ఇందులో పెద్ద కార్గో బే తప్ప సీట్లు లేదు. ఇందులో ఏదైనా లోడ్ (సరుకులు) వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ బేస్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ రిలే నుంచి 16 కిమీ లేదా ఎయిర్‌బోర్న్ రిలే 16000 కిమీ వరకు కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉందనున్నట్లు సమాచారం.

కమ్యూనికేషన్‌లు పోయినట్లయితే.. ఏక కాలంలో ఆరు వేర్వేరు డేటా లింక్‌లను రన్ చేయగలదు, తద్వారా మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా తిరిగి దాని బేస్‌లోకి తీసుకురావచ్చు. ఇలాంటి హెలికాఫ్టర్లు కార్గో డెలివరీలు, అగ్నిప్రమాదం సమయంలో అగ్నిమాపక మిషన్లుగా కూడా పనిచేస్తాయి.

ఇదీ చదవండి: దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే! 

ఈ లేటెస్ట్ హెలికాఫ్టర్ల కోసం కంపెనీ స్పెషల్ ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇవి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి, త్వరలోనే అవసరమైన సర్టిఫికెట్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తుంది. సంస్థ ఈ రోటర్ ధరను అధికారికంగా వెల్లడించలేదు, అయితే వీటి డెలివరీలు 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Images Source: Rotor Technologies

>
మరిన్ని వార్తలు