కుప్పకూలిన మార్కెట్‌, రూపాయి మరోసారి ఢమాల్‌

10 Oct, 2022 10:17 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి అత్యంత కనిష్టానికి పడిపోయింది. డాలరు మారకంలో రూపాయి సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో 38 పైసలు కోల్పోయి 82.68 వద్ద ఆల్ టైం కనిష్టాన్ని తాకింది. రూపాయి వరుసగా రెండో సెషన్‌లో కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది.  శుక్రవారం తొలిసారి  డాలర్‌తో పోలిస్తే రూపాయి 82 మార్కును తాకింది.   శుక్రవారం ముగింపు 82.33తో పోలిస్తే, రెండో వరుస సెషన్‌లో  కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పతనమైంది.

అటు బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్ బెంచ్‌మార్క్‌లు బీఎస్‌ఈ , ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 సోమవారం 1 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు  క్షీణించి 57,409 వద్దకు చేరుకోగా,  నిఫ్టీ  239 పాయింట్లు దిగజారి 17,074 వద్ద నిలిచింది.దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోల్‌ ఇండయా టీసీఎస్‌, డాక్టర్ రెడ్డీస్ , మారుతీ సుజుకీ ఇండియా, టైటాన్ లాభాల్లో ఉండగా టాటా మోటార్స్‌, హీరోమోటోకార్ప్‌,  హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌  టాప్ లూజర్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు