శాంసంగ్‌ మేకిన్‌ ఇండియా ఉత్పత్తులు

10 Dec, 2020 07:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలోని పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) మీద దృష్టి సారించాలని, కొత్త ఉత్పత్తులను చేపట్టాలని దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ నిర్ణయించింది. మేకిన్‌ ఇండియా ఉత్పత్తులనే అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి నుంచి ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని.. ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేశామని శాంసంగ్‌ తెలిపింది. (ఫేస్‌బుక్‌ ఇండియా లాభం రెట్టింపు)

దేశంలో 25 సంవత్సరాలు  పూర్తవుతున్న సందర్భంగా కొత్త డిజిటల్ కార్యక్రమాలను  బుధవారం ఆవిష్కరించింది. ఇందులో భాగంగా పవరింగ్‌ డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఆర్‌అండ్‌డీ స్థానిక టెక్‌ టాలెంట్‌ పీపుల్, స్టార్టప్స్‌లను ఎంపిక చేసుకుంటుంది. 5జీ, ఏఐ, ఐఓటీ, క్లౌడ్‌ టెక్నాలజీల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని శాంసంగ్‌ సౌత్‌వెస్ట్‌ ఏషియా ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈఓ కెన్‌ కాంగ్‌ తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో టెక్‌ ఇన్నోవేషన్‌ను మరింత పరిపుష్టం చేసేందుకు ఓపెన్‌ ఇన్నోవేషన్‌ను మరింత విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్‌ ముగింపుతో సామ్‌సంగ్‌కు ఇండియాలో పాతికేళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం శాంసంగ్‌కు దేశంలో మొబైల్స్, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు 2, ఆర్‌అండ్‌డీ సెంటర్లు 5, డిజైన్‌ సెంటర్‌ ఒకటి ఉంది. సుమారు 2 లక్షల ఔట్‌లెట్లు, 70 వేల మంది ఉద్యోగులున్నారు.

మరిన్ని వార్తలు