త్వరలో విడుదల కానున్న శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24.. ధర ఎంతంటే?

5 Nov, 2023 11:52 IST|Sakshi

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ త్వరలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ ఎస్‌ 23 ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఇప్పటికే మార్కెట్‌కి పరిచయం చేసిన ఫోన్‌లను విడుదల చేసిన తర్వాతనే ఈ లేటెస్ట్‌ సిరీస్‌ ఫోన్‌లను విడుదల చేయాలని శాంసంగ్‌ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

నివేదికల ప్రకారం.. ఈ కొత్త సిరీస్‌లో బేస్ గెలాక్సీ ఎస్‌24,గెలాక్సీ ఎస్‌ 234 ప్లస్‌, గెలాక్సీ ఎస్‌ 24 ఆల్ట్రాలు ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్‌ 24 సిరీస్‌ను కొత్త ఏడాది జనవరి 17న అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగే కార్యక్రమంలో విడుదల చేసే అవకాశం ఉందని ఎస్‌బీఎస్‌ బిజ్ రిపోర్ట్‌ తెలిపింది. 

శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ మోడల్‌ను సౌత్‌ కొరియాలో సుమారు రూ.70 వేల లోపు ధరతో విక్రయించనుంది. ఇంచు మించు శాంగ్‌ గెలాక్సీ ఎస్‌ 24 సిరీస్‌ ఫోన్‌ ధరలు సైతం అదే స్థాయిలో ఉండనున్నాయి. వీటి ఖచ్చిత ధర ఎంతనేది తెలియాలంటే ఈ ఫోన్‌ సీరీస్‌ విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. యాపిల్‌ ఐఫోన్‌లకు గట్టి పోటీ ఇస్తూ ఆర్థిక మాంద్యం కారణంగా గెలాక్సీ ఎస్ 23 సిరీస్, ఎస్‌ 24 సిరీస్‌ ఫోన్‌ల అమ్మకాల తగ్గకుండా ఉండేలా వ్యూహాత్మకంగా మార్కెటింగ్‌ స్ట్రాటజీని అమలు చేయనుంది శాంసంగ్‌ . తద్వారా వాటి సేల్స్‌ పెంచుకోవాలని భావిస్తుంది.

మరిన్ని వార్తలు