రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఫోన్లు

9 Feb, 2023 09:12 IST|Sakshi

హైదరాబాద్‌: దక్షిణ కొరియా శాంసంగ్‌ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్‌23 ఫోన్లు రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ‘‘శాంసంగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ ఒప్పందం ద్వారా కస్టమర్లకు గెలాక్సీ ఎస్‌23 సిరీస్‌ వంటి అత్యాధునిక సాంకేతికత అందించడం గర్వంగా ఉంది’’ అని కంపెనీ చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రియాన్‌ బడే అన్నారు. గెలాక్సీ ఎస్‌23 కొనుగోలుపై గెలాక్సీ వాచ్‌4 బ్లూటూత్‌ను రూ.2,999 పొందవచ్చు. గెలాక్సీ ఎస్‌23 అల్ట్రా కొనుగోలుపై గెలాక్సీ వాచ్‌4 క్లాసిక్‌ ఎల్‌టీఈ–గెలాక్సీ బడ్స్‌ రూ.4999కే లభిస్తుంది.

మరిన్ని వార్తలు