శామ్‌సంగ్‌ నుంచి 5 జీ ఫోన్‌.. ప్రత్యేక తగ్గింపు ధర

28 Sep, 2021 14:11 IST|Sakshi

దక్షిణ కొరియా టెక్నాలజీ కంపెనీ శామ్‌సంగ్‌ పండగ సీజన్‌లో సరికొత్త ఫోన్‌ని ఇండియా మార్కెట్‌లో లాంఛ్‌ చేయనుంది. మీడియం రేంజ్‌ బడ్జెట్‌లో  హై ఎండ్‌ ఫీచర్లతో ఈ ఫోన్‌ని కస్టమర్లకు అందుబాటులోకి తేనుంది. 

బరిలో శామ్‌సంగ్‌
దేశంలో ఇంకా 5 జీ సర్వీసులు ప్రారంభం కాలేదు. దీంతో యాపిల్‌, శామ్‌సంగ్‌ వంటి దిగ్గజ కంపెనీలు 5జీ ఫోన్‌ మార్కెట్‌పై ఇంత కాలం ఫోకస్‌ పెట్టలేదు. మరోవైపు ఎంట్రీ, మీడియం సెగ్మెంట్‌లో షావోమి, రియల్‌మీ, వన్‌ప్లస్‌ వంటి సంస్థలు వరుసగా 5జీ ఫోన్లను మార్కెట్‌లోకి తెస్తున్నాయి. దీంతో శామ్‌సంగ్‌ సైతం బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ తెచ్చేందుకు రెడీ అయ్యింది.


శామ్‌సంగ్‌ ఎం 52
5జీ టెక్నాలజీ సపోర్ట్‌తో శామ్‌సంగ్‌ సంస్థ ఎం 52 మోడల్‌ని మార్కెట్‌లోకి తేబోతుంది. అక్టోబరు 3న అమెజాన్‌లో ఈ ఫోన్‌ అమ్మకాలు షురూ అవుతున్నాయి. గ్రేట్‌ ఇండియా ఫెస్టివ్‌ సేల్స్‌లో భాగంగా ఈ ఫోన్‌ని తగ్గింపు ధరతో రూ. 26,999కే అందివ్వబోతున్నారు. 

అదిరిపోయే ఫీచర్లు
- శామ్‌సంగ్‌ ఎం 52 మోడల్‌లో లేటెస్ట్‌ స్నాప్‌డ్రాగన్‌ 778 జీ ప్రాసెసర్‌ని ఉపయోగించారు.  ప్రాసెసింగ్‌ స్పీడ్‌, ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ విభాగాల్లో ఈ ప్రాసెసర్‌ పని తీరు ఎంతో మెరుగని శామ్‌సంగ్‌ చెబుతోంది
- ఈ మొబైల్‌లో 6.7 ఫుల్‌హెచ్‌డీ ఎస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేని పొందు పరిచారు. డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేటు 120 హెర్జ్‌గా ఉంది. 
- మొబైల్‌లో వెనుకు వైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్‌ ఉండగా మిగిలిన రెండు కెమెరాలు 16 ఎంపీ (ఆల్ట్రా వైడ్‌), 5 ఎంపీ (మైక్రో లెన్స్‌)లు గాఉన్నాయి. ఫ్రంట్‌ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్స్‌.
- బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ , 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌ని అందిస్తున్నారు
- ఈ మొబైల్‌లో శామ్‌సంగ్‌ డిఫెన్స్‌ గ్రేడ్‌ సెక్యూరిటీ అయిన శామ్‌సంగ్‌ నాక్స్‌ని ఇన్‌బిల్ట్‌ చేశారు. దీంతో యూజర్ల డేటాకు మరింత భద్రత ఉంటుంది
- ఆండ్రాయిడ్‌ 11 ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫోన్‌ రిలీజ్‌ అవుతోంది. స్లీక్‌ డిజైన్‌తో పాటు కేవలం 173 గ్రాముల బరువు కలిగి ఉంది.
- స్క్రీన్‌ ప్రొటెక‌్షన్‌గా గోరిల్లా గ్లాస్‌ 5ని అందించారు.


ధరలు
వేరియంట్‌                      ధర             ఆఫర్‌​ ప్రైస్‌
6 జీబీ, 128 జీబీ         రూ.29,999        రూ.26,999
8 జీబీ, 128 జీబీ         రూ.31,999        రూ.28,999

 

చదవండి : జియో స్పెషల్‌ ఆఫర్‌... ఈ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు