చమురు సెగ : ఆరంభ లాభాలు ఆవిరి

8 Mar, 2021 16:52 IST|Sakshi

70 డాలర్లు దాటేసిన బ్రెంట్ క్రూడాయిల్ 

15వేల దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై : ఆరంభంలో లాభాలతో మురిపించిన స్టాక్‌ మార్కెట్లు చివరికి లాభాలను కోల్పోయాయి. ప్రధానంగా అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశానికి చేరడంతో  ప్రధాన సూచీల్లో అమ్మకాల ఒత్తిడి తలెత్తింది.  బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కి 70 డాలర్లు దాటడంతో దేశీయ మార్కెట్లు భారీగా ప్రభావితమైనాయి. దీంతో సెన్సెక్స్ 36 పాయింట్లు లాభానికి పరిమితమై  50441 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 14956 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. తద్వారా నిఫ్టీ 15 వేల పాయింట్ల మార్క్‌ను కోల్పోయింది. సెన్సెక్స్‌ కూడా 50500 స్థాయి దిగువకు పడిపోయింది.  సెన్సెక్స్ రోజు అత్యధిక స్థాయిలో 580 పాయింట్లు పెరగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 15,111ను తాకింది.

మీడియా, మెటల్, ఐటీ  ఫార్మా సూచీలు లాభపడగా, రియాల్టీ, ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో షేర్లునష్టపోయాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్‌,  ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ, హెచ్‌సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టిపీసీ, ఎస్‌బీఐ లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ఆ టో, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యుఎల్, టైటన్‌ నష్టపోయాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారిగా అంతర్జాతీయ బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్ 70 డాలర్లకు పెరగడంతో ముడి చమురు ధరలు మండుతున్నాయి. 

మరిన్ని వార్తలు