ఇషా అంబానీకి ఆర్‌బీఐ గ్రీన్‌ సిగ్నల్‌.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు

17 Nov, 2023 15:00 IST|Sakshi

జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ'తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆర్‌బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది.

'ఇషా అంబానీ' యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్‌బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైంది.

అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్‌లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌ వంటి  విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్‌ఫారమ్‌ లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ఇదీ చదవండి: దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్

హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్  సర్వీసెస్  ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్‌లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు