‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’

9 Oct, 2021 15:59 IST|Sakshi

ఎయిర్‌ ఇండియా సంస్థను టాటా గ్రూపు తిరిగి దక్కించుకోవడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రైవేటీకరణ అంటే సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ టాటా గ్రూపు విషయానికి వస్తే... ఈ వ్యతిరేకత  కొంత తక్కువే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే సోషల్‌ మీడియాలో ఈ డీల్‌ పట్ల సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది. 

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ హార్ష్‌ గోయెంకా ఎయిరిండియా ప్రైవేటీకరణపై స్పందించారు. మస్కట్‌ మహారాజాతో పోలిక పెడుతూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారిలో చాలా మందిని రాజా అని పిలస్తూ ఉండవచ్చు. కానీ దేశంలో మహారాజు అని పిలిచే గ్రూపు ఒక్కటే ఉంది. అది టాటా అని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు ఆనంద్‌ మహీంద్రా సైతం ఈ డీల్‌ను ఉద్దేషిస్తూ ట్వీట్‌ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే ‘ఈ టేకోవర్‌ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్‌వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’ అని పేర్కొన్నారు. 

చదవండి : వెల్‌కమ్‌ బ్యాక్‌ ఎయిర్‌ ఇండియా - రతన్‌ టాటా

మరిన్ని వార్తలు