సాక్షి మనీ మంత్ర: వరుస లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

7 Dec, 2023 10:05 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 0.29% క్షీణించి 69,454.11 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.3% క్షీణించి 20,875.25 పాయింట్ల వద్దకు చేరాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌ బుధవారం నష్టాల్లో ముగియండంతో భారత స్టాక్ మార్కెట్ గురువారం కొంత నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికాలో నవంబరులో అంచనా వేసిన దాని కంటే ఉద్యోగాలు, వేతన వృద్ధి తగ్గుతున్నట్లు డేటా వెలువడింది. చమురు ధరలు క్షీణిస్తున్నాయి. యూఎస్‌ బాండ్ ఈల్డ్‌లు తగ్గుతున్నాయి. ఇండియా బీడీపీ వృద్ధిరేటు మెరుగుపడుతోందనే సంకేతాలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుతోంది. క్రూడ్ ధర క్రమంగా క్షీణించడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. 

సెన్సెక్స్‌ 30 సూచీలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, మారుతి సుజుకీ, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌యూఎల్‌, భారతిఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాన్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల బాటపట్టాయి.

>
మరిన్ని వార్తలు