తారక్‌, యష్‌ చిత్రాలపై అంచనాలు పెంచేసిన ప్రశాంత్‌ నీల్‌

7 Dec, 2023 09:27 IST|Sakshi

కేజీఎఫ్‌ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ ఫ్రాంచైజీతో వచ్చిన రెండు సినిమాలు చరిత్రను సృష్టించాయి. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు టాప్‌ హీరోలు క్యూ కడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన చేతిలో పాన్‌ ఇండియా హీరో జూ ఎన్టీఆర్‌ చిత్రం ఉంది. ఈ సినిమాపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం కథపై ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రశాంత్‌. తాజాగా ఓ ఇంటరర్వ్యూలో తారక్‌ సినిమా గురించి మాట్లాడి అంచనాలను పెంచేశాడు. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు విభిన్నంగా తారక్‌ మూవీ ఉంటుందని ఆయన తెలిపాడు.

కానీ.. ఆ చిత్రానికి సంబంధించిన కథ ఏ నేపథ్యంలో సాగుతుందో అనేది ఆయన రివీల్‌ చేయలేదు.  అభిమానులు మాత్రం భారీ యాక్షన్‌ చిత్రమని భావిస్తున్నారని ఆయన చెప్పాడు. తారక్‌తో తీస్తున్న జానర్‌ ఏదైనా అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 2024  ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.

మరోవైపు  యష్ జోడి 'కేజీఎఫ్' ఫ్రాంచైజీలో భాగంగా పార్ట్‌-3 ఉంటుందని ఆయన తెలిపాడు. KGF విడుదలైన 3 సంవత్సరాల తర్వాత, KGF 2 విడుదలైంది. దేశవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనాతో షాక్‌కు గురైన సినిమాలకు ఇది కొత్త ఆశను తెచ్చిపెట్టింది. త్వరలో కేజీఎఫ్‌- 3 రాబోతుంది. యష్ లేని కేజీఎఫ్ లేదు. త్వరలో ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలుపుతారు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి అయింది. సీక్వెల్‌ చేయాలనే ఆలోచనతోనే 'కేజీయఫ్‌ 2' ఎండింగ్‌లో హింట్‌ ఇచ్చామని ఆయన పేర్కొన్నాడు. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌  హీరోగా ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'సలార్‌'.  ఇందులో శ్రుతి హాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన సలార్‌ ట్రైలర్‌ భారీగా రికార్డ్‌లను క్రియేట్‌ చేసింది. డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెల 15 నుంచి టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు