ఆర్ధిక అవసరాలు,ఇతరులపై ఆధారపడుతున్న భారతీయ మహిళలు

22 Oct, 2022 21:59 IST|Sakshi

ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ  మాత్రమే ఆమె విధి... అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి ఇలాంటివి మాటల్ని తరచూ వింటుండేవాళ్లం. కానీ ఇప్పుడు..ఇంటా మేమే, బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇప్పటికీ ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడిపోతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. 

మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్నీ రంగాలకు చెందిన సంస్థల్ని ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి వారే ఆర్ధిక నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త వెనకబడిపోతున్నారు. ఇటీవల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఎమాంగ్ విమెన్ పేరుతో దేశవ్యాప్తంగా 18 నగరాల్లో 22 నుంచి 55 ఏళ్ల వయసున్న 1000 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. 

అధ్యయనంలో భారతీయ మహిళల్లో అత్యధిక శాతం మంది ఇప్పటికీ భర్తలపై ఆధారపడుతున్నట్టు పేర్కొంది. అయితే, తమకు అవకాశం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని 44 శాతం మంది తమ అధ్యయనంలో చెప్పినట్టు హైలెట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు