టాటా టెక్నాలజీస్‌లో వాటా అమ్మకం.. ఎంతంటే?

14 Oct, 2023 08:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ అనుబంధ కంపెనీ టాటా టెక్నాలజీస్‌లో 9.9 శాతం వాటా విక్రయించనున్నట్లు మాతృ సంస్థ, ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా పేర్కొంది. ఇందుకు టీపీజీ రైజ్‌ క్లయిమేట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువను దాదాపు రూ. 1,614 కోట్లుగా వెల్లడించింది. 

వెరసి రూ. 16,300 కోట్ల ఈక్విటీ విలువలో టాటా టెక్‌ వాటాను టీపీజీ రైజ్‌ కొనుగోలు చేయనుంది. డీల్‌ రెండు వారాలలో పూర్తికావచ్చని టాటా మోటా ర్స్‌ అంచనా వేస్తోంది. తాజా లావాదేవీ ద్వా రా రుణ భారాన్ని తగ్గించుకునే లక్ష్యంవైపు సా గుతున్నట్లు టాటా మోటార్స్‌ తెలియజేసింది.

టీపీజీ రైజ్‌ ఇంతక్రితం వ్యూహాత్మక భాగస్వామిగా టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ లిమిటెడ్‌లో బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. టాటా టెక్నాలజీస్‌ ఆటోమోటివ్‌ పరిశ్రమలో లోతైన(డొమైన్‌) నైపుణ్యాన్ని కలిగి ఉంది. బీఎస్‌ఈలో టాటా మోటార్స్‌ షేరు శుక్రవారం 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. 
 

మరిన్ని వార్తలు