ఫోర్డ్ చెన్నై యూనిట్‌పై టాటా మోటార్స్ క‌న్ను?!

8 Oct, 2021 20:00 IST|Sakshi

చెన్నై: చెన్నైలోని మరాయ్ నగర్‌లో ఉన్న ఫోర్డ్ ఇండియా యూనిట్‌ను స్వాధీనం చేసుకునే అవకాశంపై తమిళనాడు ప్రభుత్వం టాటా గ్రూప్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి తంగం తెన్నారసుతో సమావేశం అయినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో రెండవసారి జరిగిన ఉన్నత స్థాయి చర్చల సమావేశం ఇది. సెప్టెంబర్ 27న టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ సీఎంను కలిశారు.(చదవండి: ఎయిరిండియా గెలుపుపై రతన్ టాటా ఆసక్తికర ట్వీట్!)

అయితే, ఈ సమావేశాల వివరాలు వెల్లడించలేదు. ముఖ్యమంత్రి వాటికి అధ్యక్షత వహించినప్పటి నుంచి తుది నిర్ణయానికి సంబంధించిన ప్రకటన కూడా ముఖ్యమంత్రి నుంచి వస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. టాటా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. చంద్రశేఖరన్ తమిళనాడు ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు, మిగిలినవన్నీ ఊహాగానాలు అన్నారు. ఫోర్డ్ మ‌రాయిమ‌లాయి నగర్ ప్లాంట్ 2.40 ల‌క్ష‌ల కార్లు, 3.40 ల‌క్ష‌ల ఇంజిన్ల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. 30 దేశాల‌కు ఈ కార్ల‌ను ఎగుమ‌తి చేయాల‌ని ఫోర్డ్ ఇండియా ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. యుఎస్ కార్ల తయారీసంస్థ ఈ ప్లాంట్లో 1 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. 
(చదవండి: ఎయిర్‎టెల్ బంపర్ ఆఫర్.. మొబైల్ కొంటె రూ.6000 క్యాష్‎బ్యాక్!)

ఫోర్డ్ ఇండియాకు గుజరాత్ లో స‌నంద్ వద్ద ఒక కర్మాగారం కూడా ఉంది. ఫోర్డ్ భారతదేశం నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన తర్వాత ప‌రోక్షంగా 4 వేల మంది జీవితాల‌పై ప్ర‌భావం పడ‌నుంద‌ని తెలుస్తున్న‌ది. ఈ యూనిట్ గనుక టాటా మోటార్స్ కొనుగోలు చేస్తే ఆ యూనిట్‌లో ప‌ని చేస్తున్న 2600 మంది ఉద్యోగుల‌కు ఉపశమనం ల‌భించిన‌ట్లే అవుతుంది. అయితే, ఈ విషయం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడా లేదు. కంపెనీ భారతదేశంలో సుమారు 170 డీలర్ భాగస్వాములను కలిగి ఉంది. ఈ డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్‌ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని వార్తలు