ఆటోమొబైల్‌ రంగానికి టయోటా బంపర్‌ ఆఫర్‌..

17 Sep, 2020 19:41 IST|Sakshi

త్వరలో 2 వేలకోట్ల భారీ పెట్టుబడులు..

ముంబై: దేశీయ ఆటోమొబైల్‌ రంగానికి వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్ శుభవార్త తెలపింది. జపాన్‌కు చెందిన టయోటా త్వరలోనే భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో టయోటా కార్లను నిర్మించనున్నామని, రూ.2000 కోట్లపైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. అయితే దేశంలో ఆటోమొబైల్‌ రంగానికి అధిక పన్నుల వల్ల టయోటా సంస్థ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. పెట్టుబడుల అంశంపై టయోటా కిర్లోస్కర్‌ మోటార్ ఎండీ మసకాజు యోషిమురా స్పందిస్తూ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు టయోటా సంస్థ ఎప్పుడు సిద్ధమేనని, భారత జాతీయ లక్ష్యాలను టయోటో గౌరవిస్తుందని, ఆటోమొబైల్‌ రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని యోషిమురా పేర్కొన్నారు.  

మరోవైపు టయోటా వ్యూహాలపై వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్ స్పందిసూ‌ చిన్న కార్లలో కూడా త్వరలో అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టనున్నామని, 2025 సంవత్సరం వరకు హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయపడ్డారు.‌  కాగా దేశంలో రానున్న పెట్టుబడులలో ప్రపంచ వ్యాప్త సాంకేతికతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కాగా ఇటీవల సెల్ఫ్‌ చార్జింగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ వెల్‌ఫైర్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ వేదికగా ఈ లగ్జరీ మల్టీ పర్పస్‌ వాహనాన్ని కంపెనీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు