తీవ్ర దుశ్చర్యకు పాల్పడిన ట్విటర్‌.. చర్యలకు కేంద్రం రెడీ..!

28 Jun, 2021 16:16 IST|Sakshi

న్యూ ఢిల్లీ:  గత కొన్నిరోజులుగా ట్విటర్‌కు కేంద్రానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ట్విటర్‌ పాల్పడిన తీవ్ర దుశ్చర్యతో కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ట్విటర్‌ ఇండియా మ్యాప్‌ నుంచి జమ్మూకశ్మీర్‌ను తొలగించింది. జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో  అంతర్బాగంగా చూపించింది. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. దీంతో ట్విటర్‌పై కేంద్రం తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన విషయం తెలిసిందే. ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. 
 

చదవండి: భారత్ మ్యాప్ ను తప్పుగా చూపించిన ట్విట్టర్

మరిన్ని వార్తలు