UCO Bank: ఖాతాల్లోకి రూ.820 కోట్లు పడగానే ఆనందపడిన జనం - అంతలోనే..

17 Nov, 2023 18:39 IST|Sakshi

గతంలో అనుకోకుండా కొంతమంది సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమయిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన మళ్ళీ జరిగినట్లు సోషల్ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

యూకో బ్యాంక్‌ కస్టమర్లకు ఇటీవల ఒక పెద్ద జాక్‌పాట్‌ తగిలి.. అంతలోనే మిస్ అయిపోయింది. యూకో బ్యాంక్‌ ఖాతాదారుల ఖాతాల్లోకి ఏకంగా 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అమౌంట్ డిపాజిట్ అయినట్లు వారి మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు కూడా వచ్చాయి.

ఒక్కసారిగా లెక్కకు మించిన డబ్బు ఖాతలోకి రావడంతో కొందరు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వెంటనే తేరుకున్న బ్యాంక్ జరిగిన పొరపాటుని గుర్తించి.. డబ్బు డిపాజిట్ అయిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలను బ్లాక్ చేసింది. అంత కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) కూడా నిలిపివేసింది.

ఇదీ చదవండి: దీపావళికి నెట్‌లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్

ఈ నెల 10, 13 తేదీల్లో జరిగిన కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమౌంట్ పెద్ద మొత్తంలో ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇప్పటికే 79 శాతం (సుమారు రూ. 649 కోట్లు) రికవరీ చేసినట్లు వెల్లడించింది. ఇంకా రావాల్సిన మొత్తం రూ. 171 కోట్లు. ఈ డబ్బు మొత్తం రికవరీ అవుతుందా? లేదా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు