బ్రిటన్‌–భారత్‌ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు

10 May, 2022 04:46 IST|Sakshi

లండన్‌: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఇండస్ట్రీ (సీబీఐ), కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కలిసి ఈ జాయింట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్‌ లాార్డ్‌ కరణ్‌ బిలిమోరియా తెలిపారు.

కోవిడ్, ఉక్రెయిన్‌ సంక్షోభ ప్రభావాల నుంచి ఇరు దేశాలు కోలుకునే క్రమంలో వాణిజ్యం, పర్యావరణం, ఆరోగ్య రంగం మొదలైన విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎఫ్‌టీఏ సాకారమైతే  2035 నాటికి బ్రిటన్‌–భారత్‌ మధ్య వాణిజ్యం 28 బిలియన్‌ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్‌ పౌండ్ల స్థాయిలో ఉంది. 

మరిన్ని వార్తలు