Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే!

1 Feb, 2023 13:03 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం!

పెరుగనున్నవి...
బ్రాండెడ్‌ దుస్తులు
సిగరెట్లు 
బంగారం, వెండి 
వాహనాల టైర్ల ధరలు 
విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు

తగ్గనున్నవి
ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు 
టీవీలు, మొబైల్‌ కిచెన్‌ చిమ్ని ధరలు తగ్గనున్నాయి
టీవీ ప్యానెళ్లపై కస్టమ్‌ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు
లిథియం బ్యాటరీలపై కస్టమ్‌ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు

మరిన్ని వార్తలు