StockMarketUpdate కొంపముంచిన ఫెడ్‌: దలాల్ స్ట్రీట్ ఢమాల్‌!  

15 Dec, 2022 16:06 IST|Sakshi

 సాక్షి,ముంబై:  అమెరికా ఫెడ్‌   వ్యాఖ్యలు, అంతర్జాతీయ, భారతీయ మార్కెట్ల కొంప ముంచాయి.  ఫలితంగా సెన్సెక్స్   879  పాయింట్లు పతనమై 61,799 వద్ద నిఫ్టీ 1.32 శాతం పతనమై  18,415 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. తద్వారా సెన్సెక్స్‌ 62 వేలు, నిఫ్టీ 18500 కిందికి చేరాయి. బ్యాంకింగ్, ఐటీ, మెటల్‌, రియాల్టీ షేర్లు భారీగా నష్టపోగా ముఖ్యంగా రిలయన్స్‌  టాప్‌ లూజర్‌గా ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును మరోసారి పెంచింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అధికంగానే  ఉందనీ, ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్ల పెంపు  ఉండే అవకాశం ఉందన్న ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో గుబులు రేపాయి. ఫలితంగా  అమ్మకాలు వెల్లువెతాయి.  

బ్రిటానియా, హీరో మోటో, ఎస్‌బీఐలైఫ్‌, ఎన్టీపీసీ, ఎం అండ్‌ ఎండ్‌ , సన్‌ఫార్మా లాభ పడగా, టెక్‌ మహీంద్ర, టైటన్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐఫర్‌ మోటార్స్‌ హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 34  పైసలు  పతనమై  82.76 వద్దకు చేరింది.

మరిన్ని వార్తలు