ఫ్రీగా క్రెడిట్‌ కార్డు.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్‌!

24 Jan, 2023 18:13 IST|Sakshi

ఇటీవల క్రెడిట్‌ కార్ట్‌ వాడకం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు బోలెడు ఆఫర్లతో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ క్రెడిట్‌ కార్డు గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కార్డు ఫ్రీగా లభిస్తుంది. అంతేనా ఉచితంగా బీమా కవరేజ్ కూడా పొందచ్చు. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఈ కొత్త క్రెడిట్ కార్డుని ప్రవేశపెట్టింది. కాకపోతే ఫుల్‌ ప్రయోజనాలతో వస్తున్న ఈ కార్డు కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

వారి కోసం కొత్త క్రెడిట్‌ కార్డు
ఈ క్రెడిట్ కార్డు పేరు విక్రమ్ క్రెడిట్ కార్డు (Vikram Credit Card). ఇండియన్ డిఫెన్స్‌, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది కోసం ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. బీఎప్‌ఎస్‌ఎల్‌ ( BFSL) ఇప్పటికే ఇండియన్ ఆర్మీ (యోధా), ఇండియన్ నేవీ (వరుణహ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ (రక్షమాహ్), అస్సాం రైఫిల్స్(ది సెంటినెల్) వారి కోసం ప్రత్యేకమైన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించింది.

నిస్వార్థంగా మనల్ని కాపాడుతూ, మన దేశానికి సేవ చేస్తున్న సిబ్బంది క్రెడిట్ అవసరాలను తీర్చేందుకు విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఎంత గానో ఉపయోగపడుతుందని బీఎఫ్‌ఎస​ఎల్‌ ( BFSL ) తెలిపింది. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ క్రెడిట్ కార్డులను వారికి అందిస్తామని బ్యాంక్ పేర్కొంది. విక్రమ్‌ క్రెడిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖిచి ప్రారంభించారు.

విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్లు, ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం!
►జీవితకాల ఉచిత (LTF) క్రెడిట్ కార్డ్
►ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లతో పాటు కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ యాక్టివేషన్ బహుమతి.
►ప్రమాద మరణ కవరేజీ రూ. 20 లక్షలు
►1% ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు
►LTF యాడ్-ఆన్‌లు
►ఈఎంఐ ఆఫర్లు
►కాలానుగుణంగా వ్యాపార సంబంధిత ఆఫర్లు

చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరోషాక్‌, 11 వేల కార్లు రీకాల్‌

మరిన్ని వార్తలు