EPFO: మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్‌ కాలేదా? అయితే ఇలా చేయండి..

1 Sep, 2022 19:47 IST|Sakshi

మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నా.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ (ఈపీఎఫ్‌)అకౌంట్‌లోకి డబ్బులు జమ కావడం లేదా? అయితే ఇప్పుడు మీరు ఖాతాలోకి డబ్బులు డిపాజిట్‌ కావడం లేదని ఈపీఎఫ్‌ఓకు ఇలా ఫిర్యాదు చేయండి.

సంస్థలు ప్రతినెల ఉద్యోగి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌ (ఈపీఎఫ్‌) అకౌంట్‌లోకి ప్రావిడెంట్‌ ఫండ్‌ను జమ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. గత నెల ఉద్యోగికి చెల్లించిన జీతానికి..15 రోజులలోపు యజమాని ప్రతి నెలా బేసిక్‌ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్‌తో కలిపి 12 శాతం పీఎఫ్‌ ఖాతాకు జమ చేస్తారు.

దీంతో ఆ డిపాజిట్లకు సంబంధించిన సమాచారం క్రమం తప్పకుండా ఎస్‌ఎంఎస్‌ల రూపంలో చందాదారులకు అందుతుంది. లేదంటే ఉద్యోగులు సైతం ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలోకి జమ చేసిన డిపాజిట్లను కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో సంస్థలు పీఎఫ్‌ మొత్తాన్ని డిపాజిట్ చేయవు. అప్పుడు ఉద్యోగులు తమకు రావాల్సిన పీఎఫ్‌ ఇంకా డిపాజిట్‌ కాలేదని ఎంప్లాయిఫీడ్‌బ్యాక్‌@ఈపీఎఫ్‌ఐఇండియా.జీవోవి.ఇన్‌కి ఫిర్యాదు చేయొచ్చు.

ఫిర్యాదు తర్వాత, రిటైర్‌మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ సదరు సంస్థ యజమానిని విచారిస్తుంది. ఈ విచారణలో డిపాజిట్ చేయలేదని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అంతేకాదు చెల్లించిన మొత్తం కాలానికి ఈపీఎఫ్‌ఓ అధికారులు ఉద్యోగి అసలు ప్లస్‌ వడ్డీ మొత్తం కలిపి చెల్లించేలా ఒత్తిడి తెస్తారు.

మరిన్ని వార్తలు