ఖేల్ రత్న అవార్డుకు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి నామినేట్

13 Dec, 2023 22:09 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి కూడా ప్రతిష్టాత్మక ‘ఖేల్‌రత్న’ అవార్డు కోసం రేసులో నిలిచారు. మరోవైపు.. భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీకి జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు అతని పేరును అవార్డు కోసం బీసీసీఐ సిఫారసు చేసింది. ఇటీవలి వన్డే ప్రపంచకప్‌లో షమీ 24 వికెట్లతో చెలరేగాడు.

ముందుగా నామినేట్‌ చేసిన జాబితాలో షమీ పేరు లేకపోయినా... బీసీసీఐ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో అతని పేరును చేర్చారు. షమీ కాకుండా మరో 16 మంది ఆటగాళ్లు అర్జున అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఇందులో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్, తమిళనాడు చెస్‌ ప్లేయర్‌ వైశాలి తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు