Richest Royal Family: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు!

30 Sep, 2023 21:13 IST|Sakshi

ప్రపంచంలో ఎలాన్ మస్క్, ఇండియాలో ముఖేష్ అంబానీ అత్యంత ధనవంతులని అందరికి తెలుసు. అయితే వీరికంటే కూడా సంపన్న కుటుంబం ఒకటుందని నివేదికలు చెబుతున్నాయి తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏది, ఎక్కడుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, సౌదీలోని కింగ్ 'సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్' నేతృత్వంలో ఉన్న కుటుంబం అత్యంత సంపన్న కుటుంబం అని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబంలో 15,000 కంటే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. వీరికి చమురు నిల్వల నుంచి భారీగా సంపద వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆ కుటుంబంలో అత్యంత ధనవంతుడు అల్వలీద్ బిన్ తలాల్ అల్ సౌద్.. ఆయన నికర విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు. అయితే కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తమ ఖచ్చితమైన నికర విలువను వెల్లడించలేదు. 

కొన్ని నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా రాజు ప్రస్తుతం విలాసవంతమైన అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సుమారు 4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 1000 గదులు, సినిమా థియేటర్, అనేక స్విమ్మింగ్ పూల్స్ మరియు మసీదు వంటి అదనపు సౌకర్యాలు ఉన్నట్లు సమాచారం.

ఈ రాజ కుటుంబం విలాసవంతమైన పడవలు, ఖరీదైన బంగారు పూతతో కూడిన కార్లు, ఖరీదైన దుస్తులు వినియోగిస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద ఉన్న అనేక లగ్జరీ క్రూయిజ్ షిప్‌లలో ఒక దాని విలువ సుమారు రూ. 400 మిలియన్ డాలర్లు. ఇంకా వీరు రెండు హెలిఫ్యాడ్స్, స్పోర్ట్స్ పిచ్ వంటి వాటితో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ విమానం బోయింగ్ 747-400 కలిగి ఉన్నారు.

టర్కీ బిన్ అబ్దుల్లా ఏకంగా 22 మిలియన్స్ ఖరీదైన కార్లు కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో అనేక అన్యదేశ్య మోడల్స్ అయిన లాంబోర్ఘిని అవెంటడోర్ సూపర్‌వెలోస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే, మెర్సిడెస్, జీప్, బెంట్లీ మొదలైనవి ఉన్నాయి.

మరిన్ని వార్తలు