సారె సమర్పణ

19 Nov, 2023 01:42 IST|Sakshi
సారె తీసుకువస్తున్న టీటీడీ చైర్మన్‌ భూమన తదితరులు

తిరుమల: కార్తీక బ్రహోత్సవాలను పురస్కరించుకుని శ్రీపద్మావతి అమ్మవారికి శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం వేకువ జామున శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారెను ఊరేగింపుగా కాలినడకన తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆభరణాలతో కూడిన శ్రీవారి సారెను జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. అనంతరం కోమలమ్మ సత్రం, కోదండరామాలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, లక్ష్మీపురం సర్కిల్‌, శిల్పారామం మీదుగా తిరుచానూరు పసుపు మండపానికి సారెను తీసుకొచ్చారు. ప్రత్యేక పూజల నంతరం ఆలయ మాడవీధుల గుండా ప్రదక్షిణగా వెళ్లి పద్మపుష్కరిణి వద్ద అమ్మవారికి సారెను సమర్పించారు. టీటీడీ చైర్మన్‌, ఈఓ మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి రూ.2.5 కోట్ల విలువైన 5 కిలోల బంగారు కాసుల హారం, యజ్ఞోపవీతాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు