అర్హులందరికీ సంక్షేమం.. అభివృద్ధి

19 Nov, 2023 01:42 IST|Sakshi
మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

చిత్తూరు కార్పొరేషన్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులందరికీ అందిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు, అధికారులు మరింతగా కృషి చేయాలని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. పుంగనూరులో ఎలక్ట్రికల్‌ బస్సు పరిశ్రమకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. కుప్పానికి హంద్రీ–నీవా జలాలను అందించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధికి రూ.65 వేల కోట్లు వెచ్చించారని వెల్లడించారు. జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన నాలుగు కరువు మండలాల్లో 50 శాతం ఉపాధి పనిదినాలు పెంచినట్లు వివరించారు. సీ్త్ర శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ భారతి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామన్నారు. కజెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి మాట్లాడుతూ ఏపీఎంఐపీ ద్వారా ఈ ఏడాది 500 హెక్టార్లలోని పంటలకు డ్రిప్‌ పరికరాలు అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ వారంలోపు 3 బీఎంసీయులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రమ్య మాట్లాడుతూ బడుగుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డీఈఓ విజయేంద్రరావు, డీఆర్‌డీఎ పీడీ రవి, డ్వామా పీడీ గంగాభవానీ, డీపీఓ లక్ష్మి, డీఎల్‌డీఓ రవికుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు