హేమంత్‌ కేసులో 13మంది అరెస్ట్‌

25 Sep, 2020 13:19 IST|Sakshi

యుగంధర్‌ రెడ్డే ప్రధాన నిందితుడు

సాక్షి, హైదరాబాద్‌ : చందానగర్‌కు చెందిన హేమంత్‌ కుమార్‌ హత్యకేసులో మొత్తం 13మందిని అదుపులోకి చేసినట్లు మాదాపూర్‌ ఇన్‌ఛార్జ్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వైద్య పరీక్షలు నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ హేమంత్‌ హత్యకేసులో అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డి ప్రధాన నిందితుడని వెల్లడించారు. హేమంత్‌ తల్లిదండ్రులు ఫోన్‌ చేయగానే తాము స్పందించామని, అతడి ఆచూకీ కోసం అన్నివిధాల ప్రయత్నించామన్నారు. (హైదరాబాద్‌లో పరువు హత్య కలకలం)


కేసు వివరాల గురించి డీసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం... చందానగర్‌లోని తారానగర్‌లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్ ఉండేవాళ్లు. అవంతి బీటెక్‌ చేయగా, హేమంత్‌ డిగ్రీ పూర్తి చేసి బిజినెస్‌ చేస్తున్నాడు. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌ 11న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత చందానగర్ పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సిలింగ్ తర్వాత హేమంత్, అవంతి గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న మీతో మాట్లాడాలంటూ అవంతి కుంటుంబ సభ్యులు మూడు కార్లులో గచ్చిబౌలిలోని హేమంత్‌ ఇంటికి వచ్చారు. (మమ్మల్ని నమ్మించి మోసం చేశారు: అవంతి)

చందానగర్‌ వెళ్లాలంటూ వారిద్దరినీ కారులో తీసుకెళ్లుతుండగా అనుమానం రావడంతో అవంతి, హేమంత్‌ తప్పించుకున్నారు. వెంటనే కారులో నుంచి తప్పించుకుని అవంతి తన అత్తమామలకు ఫోన్ చేసింది. అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డితో పాటు మరికొందరు హేమంత్‌ను మరో కారులో తీసుకు వెళ్లారు. హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తం అయ్యారు. హేమంత్‌ ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. నిన్న రాత్రి గోపన్‌పల్లిలో తొమ్మిదిమందిని అదుపులోకి తీసుకున్నాం. అవంతి మేనమామ యుగంధర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్‌ను సంగారెడ్డిలో హత్య చేసి, మృతదేహాన్ని అక్కడే పడేసినట్లు ఒప్పుకున్నాడు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నాం.’ అని తెలిపారు.

నిందితుల వివరాలు..
1.లక్ష్మారెడ్డి
2.సందీప్ రెడ్డి 
3.రంజిత్ రెడ్డి 
4. రాకేష్ రెడ్డి  
5.సంతోష్ రెడ్డి 
6.విజేందర్రెడ్డి 
7.యుగేందర్ రెడ్డి 
8.స్వప్న 
9.రజిత 
10.స్పందన 
11.అర్చన 
12.సాహెబ్ పటేల్ (డ్రైవర్)

మూడు కార్లు స్వాధీనం
హేమంత్ హత్యకు వినియోగించన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బ్రీజా, ఐ20,షిఫ్ట్ కార్స్ మూడింటిని కిడ్నాప్ హత్యకు నిందితులు వినియోగించారు. హత్యకు మందే పక్కా పథక రచన చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా