రెండు రాష్ట్రాల్లో 12 చోట్ల సోదాలు

23 Sep, 2020 14:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణలోని ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోదాలు ఈ రోజు సాయంత్రం వరకు జరగనున్నట్లు తెలిసింది. గ‌తంలో ఉప్ప‌ల్ సీఐగా, చిక్కడపల్లి, మల్కాజిగిరి ఏసీపీగా నరసింహారెడ్డి ప‌ని చేశారు. ఆ సమయంలో ఆయన అనేక భూత‌గాదాల్లో త‌ల‌దూర్చినట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. (చదవండి: దేవికారాణి ‘రియల్‌’ దందా!)


హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్, మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో 2 చోట్, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, అనంత‌పూర్‌లో సోదాలు కొన‌సాగుతున్నాయి. సికింద్రాబాద్ నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను అధికారులు గుర్తించారు. వాటితో పాటు భారీగా ఆస్తులు, ప్లాట్స్, వ్యవసాయ భూములు గుర్తించారు. ఈ ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేసి అవకాశం ఉందంటున్నారు అధికారులు. అంతేకాక నరసింహారెడ్డి నగర శివారు ప్రాంతాలైన మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, భూ వివాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖ‌ర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ న‌రసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించిన‌ట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు