‘నా కోసం వెతకద్దు, నువ్వు బాగా చదువుకో తల్లి’.. అని చెప్పి..

9 Jun, 2022 09:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైసూరు(బెంగళూరు): నగరంలో ఒక మహిళ అదృశ్యమైంది. రాజీవ్‌నగర నివాసి జకావుల్లా భార్య పర్వీన్‌ తాజ్‌ (37), వీరికి 18 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె ఉంది. మే 31న పర్వీన్‌ను ఆమె కుమారుడు స్కూటర్‌లో కేఎస్‌ఆర్టీసీ గ్రామీణ బస్టాండ్‌లో డ్రాప్‌ చేశాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. తరువాత ఆమె కుమార్తెకు ఫోన్‌ చేసి తాను రావడం లేదని, తన కోసం వెతకవద్దని, నువ్వు బాగా చదువుకో అని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసింది. లష్కర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. మహిళ కోసం గాలింపు చేపట్టారు.  

మరో ఘటనలో..
సోదరుల గొడవలో ఒకరు మృతి  
శివాజీనగర: ఇంటి విషయమై ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గోవిందపుర పోలీస్‌ స్టేషన్‌ వ్యాప్తిలో ఈ నెల 6న మధ్యాహ్నం ప్రశాంతనగర మహేశ్వరి బార్‌ వద్ద సోదరులు అశోకన్, కపిలన్‌ మధ్య గొడవ జరిగింది. అశోకన్, కపిలన్‌ను కిందకు తోశాడు. దీంతో కపిలన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేసి మంగళవారం నిమ్హాన్స్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా కపిలన్‌ మృతి చెందాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.   

చదవండి: సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ..

మరిన్ని వార్తలు