భద్రాచలంలో విషాదం.. నాలాలో పడి మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

30 Sep, 2023 16:58 IST|Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం కేటీఆర్ పర్యటనకు బందోబస్తు వచ్చిన కొత్తగూడెం వన్ టౌన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి ప్రమాదవశాత్తు అన్నదాన సత్రం దగ్గర ఉన్న నాలాలో పడి మృతి  చెందింది.

గోదావరి కరకట్ట స్లూయిస్‌ల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. మరోవైపు భద్రాచలంలో భారీ వర్షం నేపథ్యంలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కి వాతావరణం అనుకూలించకపోవడంతో కేటీఆర్‌ పర్యటన రద్దయ్యింది.
చదవండి: మర్రిగూడ తహశీల్దార్‌ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.2 కోట్ల నగదు గుర్తింపు

మరిన్ని వార్తలు