బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట నారాయణ సస్పెన్షన్‌

5 Sep, 2021 11:27 IST|Sakshi

సాక్షి, అనంతపురం: కొత్తచెరువులో ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటనారాయణను సస్పెండ్‌ చేస్తూ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ మాధవి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై డీఐజీ సీరియస్‌ అయ్యారు. 1.92 లక్షల చలానా డబ్బులు ట్రెజరీకి చేరకుండానే వెంకట నారాయణ రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ సురేష్ ఆచారి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్టర్ల అక్రమాలపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీ మాధవి సమగ్ర విచారణ చేపట్టారు.

సురేష్ ఆచారి.. 9 నెలల్లో 1000 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలింది. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ హరివర్మ నేతృత్వంలోని బృందం సురేష్‌ ఆచారి అక్రమాలపై విచారణ చేపట్టింది. గత తొమ్మిది నెలల వ్యవధిలోనే 999 అక్రమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించింది. ఇందులో 830 అసైన్డ్‌ భూములకు సంబంధించినవి కాగా, ప్రభుత్వ భూములకు సంబంధించి 165, దేవదాయ శాఖ భూములకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరాధీనం చేసినందుకు గాను సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ రూ.కోట్లలోనే ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ చదవండి:
సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర
ఇన్నాళ్లు ఎక్కడున్నావయ్యా.. భర్తను చూడగానే..

మరిన్ని వార్తలు