మీకోసం సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! 

25 Dec, 2023 05:00 IST|Sakshi

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే టార్గెట్‌గా సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తులు 

బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు చెప్పొద్దన్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సర్‌ఫ్రైజ్‌ గిప్‌్టలని, పండగ ఆఫర్లు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా మీకు ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే మెసేజ్‌లను, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దని తెలంగాణ సైబర్‌ బ్యూరో అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా నూతన సంవత్సరం పేరిట దుస్తులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ఎస్సెమ్మెస్‌లలోని లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని వారు సూచిస్తున్నారు.

ఇలాంటి లింక్‌లలో సైబర్‌ నేరగాళ్లు ఫోన్, ల్యాప్‌లాప్‌లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్‌ భద్రత నిపుణులు హెచ్చరించారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా  కూపన్లు, గిఫ్ట్‌లు రావన్న విషయాన్ని గుర్తించాలని, ఇలా మన బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకుని అకౌంట్‌లోని డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లు, ఎస్సెమ్మెస్‌లపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in లోనూ సమాచారం ఇవ్వాలని సూచించారు.   

>
మరిన్ని వార్తలు