మద్యం మత్తు ఫ్రెండ్స్‌తో డ్యాన్స్‌ చేస్తుండగా కత్తితో.. వీడియో వైరల్‌

19 Mar, 2022 16:20 IST|Sakshi

భోపాల్‌: శుక్రవారం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజలందరూ ఎంతో ఆనందంతో వేడుకలను జరుపుకున్నారు. కాగా హోలీ వేడుకల్లో అపశృతి జరిగింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తనను తానే కత్తితో పొడుచుకుని మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఇండోర్‌లో గోపాల్‌ సోలంకీ(38) అనే వ్యక్తి హోలీ వేళ తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సోలంకీ ఓ కత్తిని చేతిలో పట్టుకుని డ్యాన్స్‌ ఫ్రెండ్స్‌తో డ్యాన్స్‌ స్టెప్పులేశాడు. ఈ క్రమంలో చేతిలో కత్తి ఉన్న విషయాన్ని మరిచిపోయి త‌న ఛాతిని నాలుగు సార్లు పొడుచుకుంటూ డ్యాన్స్‌ చేశాడు. తాగిన మైకంలో కత్తి ఘాటును ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇంతలో రక్తం విపరీతంగా కారుతుండటం పక్కనే ఉన్న ఓ మహిళ గమనించి ఆందోళనకు గురైంది.

దీంతో సోలంకీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండె భాగం నుంచి రక్తం ఎక్కువగా కారిపోవడంతో అతను అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పండుగ వేళ గోపాల్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు