విద్యుత్‌శాఖలో మీటర్ల గోల్‌మాల్‌.. అసలు విషయం ఏంటంటే..

25 Mar, 2022 09:05 IST|Sakshi

ఉద్యోగి సస్పెన్షన్‌.. కేసు నమోదు

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యుత్‌ శాఖలో అవినీతి భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌ శాఖ కార్యాలయంలో ఆర్టిజన్‌–2 కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి కృష్ణ  వినియోగదారుల నుంచి నేరుగా డబ్బులు తీసుకుని మీటర్లను నేరుగా విక్రయించాడు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ ద్వారా కంజుమర్‌ సెంటర్‌లో విద్యుత్‌ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్న వారికే మీటరు ఇవ్వాలి. సదరు ఉద్యోగి నేరుగా డబ్బులు తీసుకొని అమ్ముకున్నాడు.

రోజుకు ఎన్ని మీటర్లు విక్రయించాడు.. ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అధికారులు మా మూలుగా తీసుకోవడంతో ఈ వ్యవహరం జరిగి న్నట్లు తెలుస్తుంది. సదరు ఉద్యోగి విక్రయించిన మీటర్లకు బిల్లులు రాకపోవడంతో వినియోగదారులు ఈ విషయాన్ని అధి కారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ బాగోతం బయటపడింది. విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉత్తం జాడే కృష్ణపై సస్పెషన్‌ వేటు వేశారు. అలాగే పట్టణంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈ మేరకు ఎస్సై హజరుద్దీన్‌ బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. కాగా కృష్ణ 40మందికి మీటర్లు విక్రయించినట్లు ఎస్‌ఈ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.1900 వసూళ్లు చేసినట్లు పేర్కొన్నారు. ఎంత మంది వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేశారో విచారణలో బయట పడనుంది. దీంతో కొంతమంది ఉద్యోగులు, అధికారుల్లో గుబులు రేపుతోంది.

మరిన్ని వార్తలు