వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి ప్రియుడి ఇంట్లో ఘర్షణ..

7 Dec, 2021 08:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిక్కబళ్లాపురం(కర్ణాటక): నగరంలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ హత్యకు గురైంది. వివరాలు... నగరంలోని నక్కలకుంట వార్డులో నివాసం ఉంటున్న నరసింహప్పకు అంజినమ్మ (40) అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అంజినమ్మ.. నరసింహప్ప ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంత ఘర్షణ జరిగింది.  

ఆగ్రహంతో నరసింహప్ప బలమైన వస్తువుతో అంజినమ్మ తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చుట్టుపక్కల వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టారు. ఎస్‌పీ మిథున్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

మరిన్ని వార్తలు