టీఎస్‌పీఎస్‌సీ పేరుతో నకిలీ ఈమెయిల్‌

13 Mar, 2021 16:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఎస్‌పీఎస్‌సీ పేరుతో నకిలీ ఈమెయిల్‌ సృష్టించారు గుర్తు తెలియని కొందరు వ్యక్తులు. ఈ మేరకు తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ విభాగానికి నకిలీ ఈమెయిల్‌ వచ్చింది. ఆ మెయిల్‌లో పౌరసరఫరాలు, పోలీస్‌శాఖ సహా పలు శాఖల్లో ఖాళీలున్నాయని ఉంది. దీంతో టీఎస్‌పీఎస్‌సీ ముఖ్యకార్యదర్శి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు