లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్‌ డాక్టర్‌

29 Jan, 2021 10:28 IST|Sakshi
నిందితుడు భరత్‌ కుమార్‌ నారుమంచి, హతురాలు క్యాథరిన్‌ లిండ్లే డాట్సన్‌

వాషింగ్టన్‌ : అమెరికాలోని ఓ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన వైద్యుడు ఓ మహిళా వైద్యురాలిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టెక్సాస్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నపిల్లల వైద్యుడు‌ భరత్‌ కుమార్‌ నారుమంచి(43)కు క్యాన్సర్‌ సోకినట్లు కొద్దిరోజుల క్రితం నిర్థారణ అయింది. అతడు ఎక్కువ రోజులు బతకడని కూడా వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అప్పటినుంచి మానసికంగా కృంగిపోయాడు. (జంట హత్యల కలకం.. రూ. 500లు మాత్రమే..)

మంగళవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో గన్స్‌తో తను పనిచేసే ఆస్టిన్‌లోని ‘‘ చిల్డ్రన్స్‌‌ మెడికల్‌ గ్రూపు’’ ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. తనతో పాటు పనిచేసే ఓ వైద్యురాలు క్యాథరిన్‌ లిండ్లే డాట్సన్‌తో పాటు మరికొంతమందిని గన్స్‌తో బెదిరించి దిగ్బంధించాడు. దాదాపు 6 గంటల పాటు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాథరిన్‌ను తప్ప మిగిలిన వారిని వదిలేసిన అతడు ఆమెను కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే హత్య చేయటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు