నవరాత్రి ఉత్సవాల్లో అపశ్రుతి.. రెండు వర్గాల మధ్య పోట్లాట

2 Oct, 2022 20:01 IST|Sakshi

భోపాల్‌: నవారాత్రి ఉత్సవాల్లో  అపశృతి చోటు చేసుకుంది. రెండు వర్గాల వారు బీభత్సంగా కర్రలతో కొట్లాడుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో బోపాల్‌లోని కంకర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గర్బా ఫంక్షన్‌లో ఇద్దరు అమ్మాయిలు చేసిన అశ్లీల నృత్యంపై వాదన ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.

ఐతే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని అ‍న్నారు. వారంతో కర్రలతో తీవ్రంగా కొట్లాడుకున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఐతే దళిత సంఘాల సభ్యులు దుర్గామాత విగ్రహం ప్రతిష్టించినందుకు అగ్రవర్ణాలవారు తమపై దాడి చేశారని చెబుతున్నారు. మరోవర్గం వారు ఆ అమ్మాయిల చేసిన అశ్లీల నృత్యం కారణంగానే గొడవ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

(చదవండి:  టీచర్‌ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..)

మరిన్ని వార్తలు