దివ్యాంగుల వసతి గృహంలో కీచక హెచ్‌ఎం..

27 Jun, 2021 09:12 IST|Sakshi

సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దివ్యాంగుల వసతి పాఠశాలలో విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడిని నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. దివ్యాంగుల వసతి పాఠశాలలో హెచ్‌ఎం రంగనాథ్‌ (35) కోవిడ్‌ నేపథ్యంలో అందరిని ఊర్లకు పంపి ఏడుగురు విద్యార్థులను మాత్రమే పాఠశాలలో ఉంచుకుని వారిని నిత్యం తన గదిలోకి పిలిపించి లైంగికంగా వేధించేవాడు.

ఇంట్లో చెబితే చంపేస్తానని విద్యార్థులను బెదిరించేవాడు. ఈ విషయం రంగనాథ్‌ తల్లికి తెలిసి ఆమె పాఠశాల పాలక మండలికి ఫిర్యాదు చేసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  

చదవండి: మూడేళ్ల నుంచి లైంగిక వేధింపులు.. కేసు పెట్టిన మారలేదు.. చివరకు..

మరిన్ని వార్తలు