‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’

29 Nov, 2021 08:04 IST|Sakshi
బాల్‌రాజు, శ్రీను, శివ  

 ఎన్‌ఎఫ్‌సీ వద్ద కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్‌

లారీని పక్కకు జరపాలని హోంగార్డు ఆదేశం

పోలీసులమంటూ వివరాల సేకరించిన హోంగార్డు స్నేహితులు

లారీ డ్రైవర్‌ నుంచి డబ్బులు వసూలు

డ్రైవర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

సాక్షి, ఘట్‌కేసర్‌: ‘మేము పోలీసులం.. కేసు నుంచి తప్పిస్తాం’అని లంచం తీసుకున్న వారిని ఘట్‌కేసర్‌ పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 25న కాళేశ్వరం నుంచి ఘట్‌కేసర్‌కు (టీఎస్‌ 07యూఈ 5355) లారీ ఇసుక లోడుతో వస్తుండగా ఎన్‌ఎఫ్‌సీనగర్‌ వంతెన వద్ద కారును ఢీకొట్టింది. సంఘటన స్థలానికి ఘట్‌కేసర్‌ ప్యాట్రోలింగ్‌ మొబైల్‌ వ్యాన్‌–1 వెళ్లింది. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్యాట్రోలింగ్‌ డ్రైవర్‌ హోంగార్డు శివ లారీని పక్కకు జరపాలని ఆదేశించారు. లారీ డ్రైవర్‌ జాజుల నర్పింహ లారీని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాడు. 

అదే సమయంలో వనస్థలిపురంలో 2010లో హోంగార్డుగా విధుల్లోకి చేరి 2014 నుంచి గైర్హాజరు అవుతున్న ఏ–1 బాల్‌రాజ్‌(35), ఏ–2 శ్రీను (డైవర్‌)తో కలిసి ఓ ఆటోను విడిపించాలని మాట్లాడడానికి ఏ–3 హోంగార్డు శివకు ఫోన్‌ చేశాడు. వెంటనే లారీ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించాలని వారిద్దరికి శివ ఆదేశించారు. వారిరువురు లారీ డ్రైవర్‌ దగ్గరికి వెళ్లి ఘట్‌కేసర్‌ పోలీసులమంటూ వివరాలు సేకరించి శివకు అందించారు. 
చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్‌ ఆన్‌ చేసి..

డ్రైవర్‌ ఫిర్యాదుతో హోంగార్డు సస్పెండ్‌.. 
ప్రమాదాన్ని ఎవరూ గమనించలేదని డబ్బులు ఇస్తే తప్పిస్తామని వారు లారీ డ్రైవర్‌ను డిమాండ్‌ చేశారు. డ్రైవర్‌ రూ.20వేలు బాల్‌రాజ్‌కు ఇచ్చాడు. అనంతరం శివకు రూ.15 వేలు అందజేసి మిగిలినవి తన దగ్గర ఉంచుకున్నాడు. లారీ డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు సెల్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేసి ఘట్‌కేసర్‌కు చెందిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. కాగా ఉన్నతాధికారులు హోంగార్డు శివను (ఏ–3) విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు