హైదరాబాద్‌: చీప్‌ మెడిసిన్స్‌.. అధిక రేటు.. పలు మెడికల్‌ షాపుల లైసెన్స్ లు రద్దు

8 Jun, 2023 11:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మెడికల్‌ దుకాణాలపై డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం మెరుపు దాడులు చేసింది. పలు మెడికల్‌షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు, నాణ్యత లేని మందుల అమ్మకాలను గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న పలు మెడికల్‌ దుకాణాల లైసెన్స్‌లను శాశ్వతంగా, మరికొన్నింటికి తాత్కాలికంగా రద్దు చేశారు. 

ఇందర్‌బాగ్‌ కోటిలోని గణేష్‌ ఫార్మాసూటికల్స్‌, అంబర్‌పేట బయోస్పియర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, నాంపల్లి సర్దార్‌ మెడికల్‌ హాల్‌, అక్షయ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌, హైదరాబాద్‌ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌(నాంపల్లి), లంగర్‌హౌజ్‌లోని ఆర్‌ఎస్‌ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, చార్మినార్‌ భారత్‌ మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, హుమాయూన్‌నగర్‌ అల్‌-హమ్రా మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌.. 

ఉప్పల్‌ శ్రీ అయ్యప్ప మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, గౌలిగూడ గోకుల్‌ మెడికల్‌ షాప్‌, చార్మినార్‌ మీరా మెడికల్‌ షాప్‌, మంగర్‌బస్తీ లైఫ్‌ ఫార్మా.. ఇలా పలు మెడికల్‌ షాపులపై డ్రగ్‌ కంట్రోల్‌ చర్యలు తీసుకుంది. వీటిలో కొన్నింటి లైసెన్స్‌లను తాత్కాలికంగా, మరికొన్నింటిని లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేసింది.  

ఇదీ చదవండి: గట్టు కోసం గొడళ్లతో గొడవ

మరిన్ని వార్తలు