అత్తింటి ముందు కోడలు బైఠాయింపు

8 Nov, 2021 12:01 IST|Sakshi

సాక్షి, చీరాల అర్బన్‌: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో కాన్పుకు పుట్టింటికి వెళ్లి తిరిగి పసిబిడ్డతో ఇంటికి వచ్చిన కోడల్ని ఇంటిలోకి రానివ్వక పోవడంతో ఆ యువతి అత్తింటి ముందు బైఠాయించింది. ఈ ఘటన ఆదివారం వేటపాలం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్‌ కాలనీలో జరిగిది. వివరాల్లో వెళితే.. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ టైలర్స్‌కాలనీకి చెందిన గుంటి దీపు, ఇంకొల్లుకు చెందిన రోజాలు కులాంతర వివాహం చేసుకున్నారు.

వివాహం చేసుకున్న రోజు నుంచి అత్తమామలు వేధిస్తున్నారనని ఆమె ఆరోపిస్తుంది. కాన్పుకు వెళ్లి ఏడు నెలల పసిబిడ్డతో ఆదివారం ఇంటికి రాగా ఇంటిలోకి రానివ్వలేదని ఆమె వాపోయింది. సమాచారం అందుకున్న టూటౌన్‌ ఎస్సై రత్నకుమారి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ యువతిని ఇంటిలోకి పంపించారు. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది.   

మరిన్ని వార్తలు