Jubilee Hills: ఫుడ్‌కోర్ట్‌ టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ పెట్టి.. వీడియోలు రికార్డింగ్‌

23 Sep, 2021 07:55 IST|Sakshi

హౌస్‌ కీపింగ్‌ బాయ్‌ నిర్వాకం

యువతి ఫిర్యాదుతో వెలుగులోకి.. 

నిందితుడిపై ‘నిర్భయ’కేసు 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న వన్‌ డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్‌లో తన సెల్‌ఫోన్‌ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్‌ కీపింగ్‌ బాయ్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా బట్టి గూడెం గ్రామానికి చెందిన బొంగరాల బెనర్జీ (18) ఓ హోటల్‌లో ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాడు.
(చదవండి: పెళ్లై ఇద్దరు పిల్లలు, ఇంకా పెళ్లి కాలేదని..హోటల్‌కు తీసుకెళ్లి)

మూడురోజుల క్రితం తన సెల్‌ఫోన్‌ వీడియో కెమెరా ఆన్‌ చేసి హోటల్లో మహిళలు ఉపయోగించే టాయిలెట్‌లో పైన పెట్టాడు. దానిలో రికార్డైన వీడియోలు ప్రతిరోజూ చూస్తుండేవాడు. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు కొనసాగుతోంది. అయితే బుధవారం ఓ యువతి ఆ సెల్‌ఫోన్‌ను గమనించి యజమానికి ఫిర్యాదు చేసింది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బెనర్జీని అదుపులోకి తీసుకున్నారు.
(చదవండి: ఆ బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో)

సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశారు. సుమారు 20 మంది మహిళల వీడియోలు ఫోన్లో చిత్రీకరించినట్లుగా గుర్తించారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడురోజుల నుంచే ఈ తతంగం నడుస్తోందా? ఇంతకు ముందు కూడా ఏమైనా వీడియోలు తీశాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: అతడి భార్య, ఆమె భర్త మిస్సింగ్‌.. పోలీసులే అవాక్కయ్యారు!)  

మరిన్ని వార్తలు