కార్వీ సీఎండీ పార్థసారథి కేసు: సీసీఎస్‌కు పెరుగుతున్న బాధితుల సంఖ్య

23 Aug, 2021 12:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్వీ సీఎండీ పార్థసారథి కేసులో(సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌) సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, పార్థసారథిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో (సీసీఎస్‌) పోలీసులు ప్రత్యేక పిటిషన్‌ను దాఖలు చేశారు.  ఈ కేసుకు సంబంధించిన బాధితులు పెద్ద ఎత్తున సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ క్రమంలో మదుపరుల పెట్టుబడితో కలిపి రూ. 2 వేల కోట్లకు స్కాం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకర్ల ఫిర్యాదు మేరకు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు.

చదవండి: కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి అరెస్ట్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు