అశ్లీల ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.7లక్షలు వసూలు 

22 Jul, 2021 06:56 IST|Sakshi
అరెస్టయిన న్యాయవాది డార్జన్‌

తిరువొత్తియూరు: విడాకుల కోసం ఆశ్రయించిన మహిళపై అత్యాచారం చేసి నగ్నఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిన న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరువళ్లూర్‌ సమీపంలోని మనవాళనగర్‌కు చెందిన వివాహిత విడాకులు తీసుకోవడానికి తిరువళ్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది డార్జన్‌ (44)ని కలిసింది. కేసుకు సంబంధించిన ఆధారాలను ఇంటికి వచ్చి తీసుకుంటానని న్యాయవాది చెప్పాడు. ఆ తర్వాత మహిళ ఇంటికి వెళ్లిన డార్జన్‌ శీతలపానియంలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు. ఆమె స్పృహతప్పడంతో నగ్న ఫొటోలను తీశాడు. అనంతరం అత్యాచారం చేశాడు.

నగ్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి రూ.7 లక్షలు వసూలు చేశాడు. నగదు కోసం పలుమార్లు ఆమెకు బెదిరింపులు ఇచ్చాడు. దీనిపై ఆమె తిరువళ్లూరు మహిళా కోర్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొడైక్కెనాల్‌లో ఉన్న డార్జన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు