గూడూరులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

1 Jul, 2021 14:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు : జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గూడూరు రెండో పట్టణంలో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. తేజస్విని, వెంకటేష్‌ అనే యువతీ, యువకులు గూడురు రెండో పట్టణంలోని ఓ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆపస్మారక స్థితిలో ఉన్న వీరిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తేజస్విని మరణించగా.. వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈ జంట ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది అన్న వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు