మాయమాటలతో బాలికను మభ్యపెట్టి..

17 May, 2021 08:47 IST|Sakshi

కొల్లూరు (వేమూరు): ఓ వివాహితుడు మాయమాటలతో బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుని, లైంగికదాడి చేసిన ఘటనపై కొల్లూరు పోలీసు స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని దోనేపూడి శివారు గ్రామానికి చెందిన బాలిక భట్టిప్రోలులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లల తండ్రయిన 35 ఏళ్ల కూచిపూడి శ్రీను కొన్నేళ్లగా ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆకట్టుకున్నాడు. శ్రీనుతో తమ కుమార్తె మాట్లాడటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను మందలించారు. కొంతకాలంగా బాలికతో శ్రీను చాటుగా ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

రెండేళ్ల క్రితం అతని భార్య ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లి చేసుకుంటానంటూ నమ్మిబలికి బాలికకు మరింత దగ్గరయ్యాడు. ముందుస్తు ప్రణాళిక ప్రకారం ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉండాలని బాలికకు చెప్పి ఈనెల 12 తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను తీసుకుని దోనేపూడిలోని తమ బంధువుల ఇంటికి, అక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్లాడు. ముందుగానే అద్దెకు తీసుకున్న గదిలో మూడురోజులు బాలికతో ఉన్న శ్రీను లైంగికదాడి చేయబోగా ఆమె ప్రతిఘ టించింది.

అనంతరం స్థానికంగా ఉన్న ఓ గుడిలో బాలిక మెడలో తాళికట్టి భార్యాభర్తలమని నమ్మించి లైంగిక దాడిచేశాడు. ఆదివారం తెల్లవారు జామున కిరాయికి కారు మాట్లాడి బాలికను ఒంటరిగా ఇంటికి పంపించాడు. అనంతరం పూర్తి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికతో కొల్లూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. శ్రీనుపై కిడ్నాప్, లైంగికదాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ తెలిపారు.

చదవండి: గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య    
టీడీపీ నేతల దాడి: ఇద్దరి పరిస్థితి విషమం 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు