Srikakulam Crime: భార్యకు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. భర్త షాకింగ్‌ నిర్ణయం

8 Nov, 2022 16:17 IST|Sakshi
గోపాల్‌(ఫైల్‌ఫోటో)

సోంపేట(శ్రీకాకుళం జిల్లా): వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు, సాధారణ జీవితంలో కుంగుబాటు కలగలిపి ఓ వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. మామిడిపల్లి పంచాయతీ రాజాం గ్రామానికి చెందిన యలమంచి గోపాల్‌(27) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బారువ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజాం గ్రామానికి చెందిన యలమంచి బైరమ్మకు ముగ్గురు కుమారులు. ఇందులో ఇద్దరు విదేశాల్లో వలస కార్మికులుగా ఉన్నారు.

మూడో కుమారుడు గోపాల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. గోపాల్‌కు అదే గ్రామానికి చెందిన దుమ్ము చాందినితో 18 నెలల కిందట వివాహమైంది. అయితే ఆరు నెలల నుంచి దంపతుల మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. గ్రామ పెద్దలు రెండు సార్లు సమావేశం నిర్వహించి ఇద్దరు దంపతులను కలపాలని చూశారు. ఈ నెల 6న మరోసారి సమావేశం నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు.

అయితే భార్యకు ఎంత చెప్పినా కాపురానికి రావడం లేదని కలత చెందిన గోపాల్‌ ఆదివారం సాయంత్రం పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లి వెంటనే హరిపురం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే గోపాల్‌ మృతితో రాజాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి ఫిర్యాదు మేరుకు బారువ ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
చదవండి: పాతబస్తీలోని కాలాపత్తర్‌లో దారుణం.. వీడియోకాల్‌లో..    

మరిన్ని వార్తలు