ఫిర్యాదు చేసిందని బాలిక హత్య

23 Aug, 2022 10:10 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తన తండ్రితో చెప్పుకోవడం ఆ బాలిక పాలిట శాపంగా మారింది. ఆ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేసి తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా జిందాల్‌ క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. వీరందరూ వలస కార్మికులే. జిందాల్‌ అల్యూమినియం కంపెనీ ఉద్యోగి లక్ష్మణ్‌సింగ్‌.. జిందాల్‌ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు.

ఇతడి కుమార్తె ఖుషి (11)ని ఇదే క్వార్టర్స్‌లో ఉండే నందకిశోర్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. క్వార్టర్స్‌లో ఖుషి కుటుంబం రెండవ అంతస్తులో నివసిస్తుంటే మొదటి అంతస్తులో నందకిశోర్‌ ఉంటున్నాడు. ఖుషి కిందకు వస్తున్నప్పుడు నందకిశోర్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడట. 

ఈ విషయం ఖుషి తన తండ్రితో చెప్పడంతో నందకిశోర్‌తో గొడవపడ్డాడు. అసోసియేషన్‌ ముందు పంచాయతీ పెట్టి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పించాడు. ఇదే ఆక్రోశంతో నందకిశోర్‌ సోమవారం ఖుషిని టెర్రస్‌పైనే కత్తితో పొడిచి అనంతరం తానూ కత్తితో పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ నందకిశోర్‌ను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ చికిత్స ఫలించక మృతి చెందాడు.  మాదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

(చదవండి: ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..)

మరిన్ని వార్తలు